Wednesday, January 22, 2025

రాహుల్ పిటిషన్ కొట్టివేసిన గుజరాత్ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టు ఎదురు దెబ్బ తగిలింది. మోడీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలు అన్న అర్థం వచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలకు గాపై దాఖలైన పరువునష్టం కేసులో తనకు దిగువ కోర్టు విధించిన రెండేళ్ల జైలుశిక్షను నిలుపుదల చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సూరత్ కోర్టు మార్చిలో విధించిన జైలు శిక్షతో రాహుల్ గాంధీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. రాహుల్ గాంధీ పిటిషన్‌ను కొట్టివేసిన గుజరాత్ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి హేమంత్ ప్రచారక్ ఉత్తర్వులలో కొంత భాగాన్ని చదివారు.

తగిన కారణాలు లేకుండా పిటిషనర్ శిక్షపై స్టే కోరుతున్నారని న్యాయమూర్తి చెప్పారు. అత్యంత అరుదైన కేసులలోనే శిక్షపై స్టే అనే మినహాయింపు లభిస్తుందని, ఇది నిబంధనేమీ కాదని ఆయన అన్నారు. అనర్హత అనేది ఎంపీలు, ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితం కాదని ఆయన చెప్పారు. పైగా పిటిషనర్‌పై దాదాపు 10 క్రిమినల్ కేసులో పెండింగ్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు. సూరత్ కోర్టు విధించిన శిక్ష చట్టబద్ధంగా, న్యాయసమ్మతంగా ఉందని తాము భావిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. రాహుల్ గాంధీపై పుణె కోర్టులో వినాయక్ దామోదర్ సావర్కర్ మనవడు దాఖలు చేసిన పరువునష్టం కేసు విషయాన్ని కూడా న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో వయనాడ్ ఎంపి సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ కు గాంధీకి సుప్రీంకోర్టు మినహా మరో మార్గాంతరం లేకుండాపోయింది. సుప్రీంకోర్టులో మాత్రమే ఆయనకు ఊరట లభించాల్సి ఉంటుంది. అక్కడా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన పక్షంలో ఆయన రెండేళ్ల జైలు శిక్షను అనుభవించడంతోపాటు ఆరేళ్లపాటు లోక్‌సభకు పోటీచేయడానికి అవకాశం ఉండదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News