- Advertisement -
అహ్మదాబాద్ : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకుడే నేరస్థుడిగా మారుతున్న పరిస్థితిపై గుజరాత్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన వారే ప్రజలపై దోపిడీకి పాల్పడటంపై ఘాటుగా స్పందించింది. రాత్రి వేళల్లో ప్రయాణిస్తున్న దంపతులపై పోలీస్‌లు దోపిడీకి పాల్పడిన ఘటనపై గుజరాత్ హైకోర్టు ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది. అహ్మదాబాద్ పోలీస్‌ల దోపిడీకి సంబంధించి దాఖలైన పిల్ విచారణ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ అనిరుద్ధపీ మయీ ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా పలు నగరాల్లో ఈ తరహాలో ఏమైనా దోపిడీలు జరుగుతున్నాయా ? అనే నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
- Advertisement -