Monday, January 20, 2025

మోడీ డిగ్రీపై వ్యాఖ్యలు: కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన పరవునష్టం కేసుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నాయకులు అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.

ఈ ఇద్దరు ఆప్ నాయకులపై మెట్రోపాలిటన్ కోర్టులో కొనసాగుతున్న పరువునష్టం కేసు విచారణ ప్రక్రియపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సమీర్ దావే తమ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట హాజరవుతామని ఇదివరకు సెషన్స్ కోర్టులోకు వీరిద్దరూ ఇచ్చిన హామీని గుర్తు చేశారు.మీరిద్దరూ కోర్టుకు హాజరవ్వాలి..కాని కోర్టు ఎదుట హాజరుకాకుండా మీరు తప్పించుకుంటున్నారు అంటూ న్యాయమూర్తి పిటిషనర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

నరేంద్ర మోడీ డిగ్రీపై వ్యంగ్యంగా, కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గుజరాత్ యూనివర్సిటీ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌పై పరువునష్టం పిటిషన్ దాఖలు చేసింది. ఆగస్టు 11న మెట్రోపాలిటన్ కోర్టులో విచారణకు హాజరుకావాలని వీరిద్దరికీ ఇప్పటికే సమన్లు జారీ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News