Monday, December 23, 2024

వెల్ డన్ స్పన్

- Advertisement -
- Advertisement -

షాబాద్: గుజరాత్ పారిశ్రామిక వేత్తలు కూడా తమ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రాన్నే గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఇది సిఎం కెసిఆర్ పాలనకు నిదర్శనమన్నారు. ఆయన నా యకత్వంలో రాష్ట్ర రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక వేత్తల కోసం అనే బెస్ట్ పాలిసీని రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నా రు. దీని కారణంగా మన దేశం నుంచే కాకుండా అనేక దేశాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీలు సైతం రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడుCలు పెడుతున్నాయన్నారు. ఫలితంగాతెలంగాణ రాష్ట్రం ప్ర స్తుతం గనిగా మారిందని కెటిఆర్ వ్యా ఖ్యానించారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఈ ప్రగతిని సాధించడం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రిగా తనకు గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లి పారిశ్రామిక వాడలో గుజరాత్‌కు చెందిన వెల్‌స్పన్ ఇండియా లిమిటెడ్ రూ. 500 కోట్లతో ఏ ర్పాటు చేసిన అధునాతన టెక్స్‌టైల్ యూనిట్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెల్‌స్పన్ కంపెనీ ఇప్పటికే రూ.2వేల కోట్లతో రెండు యూనిట్లను ఇక్కడ నెలకొల్పిందన్నారు. రాబోయే ఐదారేళ్లలో రూ.3వేల నుంచి రూ.5వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుందన్నారు. ఇందుకు వెల్‌స్పన్ సంస్థ అధినేత బాలకృష్ణ గోయెంకాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కెటిఆర్ పేర్కొన్నారు. కిందట చందన్‌వెల్లి, సీతారాంపూర్ లాంటి ప్రాంతాల్లో మ చ్చుకు ఒక్క పరిశ్రమ అయినా కనిపించేది కాదన్నారు. కానీ ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల్లో అనేక కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి కంపెనీలను ఏర్పాటు చేస్తుండడంతో వీటి రూపురేఖలు శరవేగంగా మారిపోతున్నాయన్నారు.

ప్రధానంగా చందన్‌వెల్లిలో వెల్‌స్పన్ యాంకర్‌గా వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్, అమెజాన్, కిటెక్స్ వంటి బడా కంపెనీలు వచ్చాయని కెటిఆర్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం ఇక్కడ- ఏర్పాటుకాబోతుందన్నారు. 1985లో మొదటి సారిగా గుజరాత్‌లో కంపెనీని ప్రారంభించిన గోయెంకా అనతి కాలం లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని గణనీయంగా విస్తరించారని కెటిఆర్ తెలిపారు. ప్రస్తుతం ఒక్క గుజరాత్‌లోనే సుమారు 25వేల మందికి ఉపాధికి కల్పిస్తున్నారని ఆయ న ప్రశంసించారు. కేవలం గుజరాత్‌కే పరిమితం కాకుం డా అమెరికాలోను పెట్టుబడులు పెట్టారన్నారు. అయితే ఆయన తొలిసారిగా గుజరాత్ నుంచి బయటకు వచ్చి తెలంగాణలోనే పరిశ్రమను ఏర్పాటు చేశారన్నారు. ఇం దుకు బాలకృష్ణకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కెటిఆర్ పేర్కొన్నారు.

వాస్తవానికి ఈ యూనిట్‌ను కూడా గుజరాత్‌లోని కచ్‌లో ఏర్పాటు చేసేందుకు కం పెనీ ప్రణాళిక రూపొందించుకుందన్నారు. కానీ ఆయనను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని తాను కోరినట్లు తెలిపారు. తాను చేసిన విజ్ఞప్తికి బాలకృష్ణ సా నుకూలంగా స్పందించి ఆ యూనిట్ చందన్‌వెల్లిలో ఏర్పాటు చేశారని కెటిఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఐటి విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని వెల్‌స్పన్ కంపెనీ తీసుకున్న నిర్ణయం మరింత బలోపేతం చేస్తుందన్నారు. గచ్చిబౌలి, కొండాపూర్, పైనాన్షియల్ డిస్ట్రక్ట్ లాంటి ప్రాంతల మాదరి తమ ప్రాంతాల్లోనూ ఐటి కంపెనీలు ఏర్పాటు కావాలన్న స్థానిక ప్రాంత ప్రజల ఆకాం క్ష కూడా వెల్ స్పన్ కేంద్రం ఏర్పాటుతో నెరవేరనుందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి సబితా ఇందిరారెడ్డి, ఎంపి రంజిత్‌రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు, వెల్‌స్పన్ కంపెనీకి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
త్వరలో ఐటి సెంటర్ ఏర్పాటు
చందన్‌వెల్లిలో ప్రత్యేకంగా ఒక ఐటి సెంటర్‌ను నెలకొల్పేందుకు వెల్‌స్పన్ సంస్థ అంగీకిరించిందని కెటిఆర్ తెలిపారు. ఇందులో సుమారు 1000 నుంచి -1200 మంది ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఇచ్చేందుకు ఈ కేంద్రం దోహదపడనుందన్నారు. ఈ కేంద్రాన్ని నెలకొల్పడం వల్ల స్థానికంగా ఉన్న యువత హైదరాబాద్‌కు, బెంగళూరుకు వెళ్లాల్సిన పని ఉండదన్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టు నుంచి చందన్‌వెల్లి వరకు మెరుగైన రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో అద్భుతంగా పత్తి ఉత్పత్తవుతుందని, ఎక్కడో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని తనతో కంపెనీ అధికనేత అన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయంతో స్థానిక రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. అలాగే ఐకియాతో వెల్‌స్పన్ మధ్య ఒప్పందం ఉందని, ఇందులో స్థానిక మహిళలను భాగస్వాములను చేసి, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పడం సంతోషకరమన్నారు.
ఆ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తాం
సిఎం కెసిఆర్ అపర భగీరథుడని కెటిఆర్ అన్నారు. కెసిఆర్ చేపట్టిన నీటి ప్రాజెక్టులన్నీ శరవేగంగా పూర్తి అవుతున్నాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాలను సైతం తక్కువ సమయంలో పూర్తి చేశామన్నారు. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకే ఒక ఐకాన్ అని న్నారు.
అలాగే సుసాధ్యం అనుకున్న మిషన్ భగీరథ పథకాన్ని కూడా పూర్తి చేసి రాష్ట్రంలో ఇంటింటికి నీటి కుళాయిల ద్వారా మంచినీటి అందిస్తున్న ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. త్వరలోనే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును కూడా ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. దురదృష్టవశాత్తు కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు. ఈ నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టుపైనే దృష్టి సారించిందని కెటిఆర్ వెల్లడించారు. సాధ్యమైనంతగా త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News