Thursday, January 23, 2025

మరదలు మాట్లాడడం లేదని కత్తితో 18 సార్లు పొడిచాడు…

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: ఓ యువకుడు తన మరదలు పెళ్లికి ఒప్పుకోవపోవడంతో పాటు పోన్‌లో మాట్లాడడంలేదని ఆమెను కత్తితో పలుమార్లు పొడిచిన సంఘటన గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కిషన్ బావాజి(23) అనే యువకుడు శషాన్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. కెశోధ్ ప్రాంతంలో దగ్గరి బంధువులు మేనమామ కుటుంబ సభ్యులు ఉంటున్నారు. యువతి బావాజి గత కొన్ని రోజుల నుంచి ప్రేమిస్తున్నాడు. కానీ యువతి మాత్రం అతడిని ప్రేమించడం లేదు. శషాన్ ప్రాంత నుంచి కెశోధ్ ప్రాంతానికి కిషన్ బావాజి వచ్చాడు. అదే సమయంలో యువతి(17 ) తల్లి చనిపోవడంతో తన చెల్లితో కలిసి ఇంట్లో ఉంటుంది. తన సరుకులు కొనడానికి బయటకు వెళ్లింది. ఆమె ఒంటిరిగా ఉన్నప్పుడు ఇంట్లో కిషన్ బావిజి వచ్చాడు. ఎందుకు ఫోన్‌లో మాట్లాడడంలేదని యువతిని బావాజి ప్రశ్నించాడు.

అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని యువతి చెప్పడంతో ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది. కత్తి తీసుకొని యువతి చాతీ, పొట్ట, చేతులు, కాళ్లపై పలుమార్లు అతడు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. శరీరం 18 కత్తిపోట్లు ఉండడంతో అక్కడ నుంచి జునాఘడ్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం రాజకోట్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించాలని వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపారు. కిషన్ బావాజిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News