Sunday, December 22, 2024

మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్… ధోనీ సూపర్ క్యాచ్ (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 9 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 67 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. చెన్నై నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో టార్గట్‌ను చేధించడం కష్టంగా మారింది. వృద్ధిమాన్ సాహా (21), శుభ్‌మన్ గిల్(08), విజయ్ శంకర్(12) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్(15), డేవిడ్ మిల్లర్(06) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ రెండు వికెట్లు, డారీల్ మిచెల్ ఒక వికెట్ తీశాడు. మిచెల్ బౌలింగ్ లో విజయ్ శంకర్ ఇచ్చిన క్యాచ్ ను ధోనీ అద్భుతంగా ఒడిసి పట్టాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News