Wednesday, January 22, 2025

గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాదని కాంగ్రెస్ జోడో యాత్ర చేపట్టాలని మంత్రి కెటిఆర్ సూచించారు. మంత్రి కెటిఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.  రాహుల్ కేరళలో యాత్ర చేస్తుంటే గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పక్క పార్టీలో చేరారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మునుగోడులో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి పెద్దలకు చెప్పారని ఆరోపణలు చేశారు. 22000 కోట్ల కాంట్రాక్టుని శుశి ఇన్ ఫ్రాకు ఇస్తేనే రాజగోపాల్ రెడ్డి బిజెపి చేరారని ఆరోపణలు చేశారు. రానున్న రోజుల్లో బిఆర్ఎస్ అవసరం ఎంతైనా ఉందని, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కలపాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారని కెటిఆర్ గుర్తు చేశారు.  రైతు బంధు, రైతు భీమా వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ పెరుగుతుందన్నారు.

దేశంలో 10 వేల మంది మొబైల్ ఫోన్ ట్యాప్ అవుతున్నాయని, కిషన్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని, బిజెపి మల్టీ ఫేసెడ్ పార్టీ అని, బిజెపి నేషనల్ పార్టీ అయిన నడిపించేది గుజరాతీలు అని మండిపడ్డారు. బిజెపి అంటే దేశ ప్రజలకు తెలుసునని, గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ అని మండిపడ్డారు. సుజనా చౌదరి, సిఎం రమేష్ పైన ఉన్న కేస్ లు ఏమయ్యాయని కెటిఆర్ ప్రశ్నించారు. అంత వాషింగ్ పౌడర్ నిర్మా లాగానే ఉంది బిజెపి కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఇడి, సిబిఐ, ఐటిలను బిజెపి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్ష పార్టీలపై మాత్రమే ప్రయోగిస్తుందని మండిపడ్డారు. తమ పార్టీ ఫోకస్ 2024 లోకసభ ఎన్నికలపై  పెడుతామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News