Wednesday, January 22, 2025

బస్సులో భార్య గొంతు కోసిన పోలీస్ అధికారి.. మృతదేహంతో 200 కిలో మీటర్లు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో బస్సులో ప్రయాణిస్తుండగా ఆమెను పోలీస్ అధికారి (భర్త) కత్తితో పొడిచి చంపి అనంతరం మృతదేహంతో 200 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన గుజరాత్ రాష్ట్రం చోటవ్‌దేపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సూరత్ జిల్లాలో అమృత్ రత్వా అనే వ్యక్తి పోలీస్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. అమృత్‌కు మంగుబెన్ అనే భార్య ఉంది. ఆమె గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో కండక్టర్‌గా పని చేస్తుంది. ఆమెకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను ప్రతి రోజూ వేధించేవాడు.

మంగళవారం రోజు ఆమెకు అతడు ఫోన్ చేయడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. వెంటనే కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రయణిస్తున్న బస్సులోకి ఎక్కాడు. ఆమె పక్క సీట్లో కూర్చొని ప్రయాణం చేస్తున్నప్పుడు కత్తితో ఆమె గొంతు కోశాడు. అనంతరం కడుపులో రెండు మూడు సార్లు పొడిచాడు. అనంతరం మృతదేహంతో అతడు 200 కిలో మీటర్లు ప్రయాణించాడు. ఆమె రక్తపు మడుగులో కనిపించడంతో వెంటనే ప్రయాణీకుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని సదరు పోలీస్ అధికారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News