Sunday, January 19, 2025

ప్రియురాలుకు వీడియో కాల్ చేసి… మర్మాంగాన్ని కట్ చేసుకున్న ప్రియుడు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఓ యువకుడు తన ప్రియురాలుతో గొడవ పడి.. ఆమెకు వీడియో కాల్ చేసి తన మర్మాంగాన్ని బ్లేడ్‌తో కట్ చేసుకున్న సంఘటన గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పశ్చిమ బెంగల్‌కు చెందిన ప్రసన్న జీత్ బర్మన్ తన మామయ్య శపన్ బర్మాతో కలిసి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉంటున్నాడు. అక్కడ ఓ కంపెనీలో జాబ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అమ్మాయి పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇద్దరు గత కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో లవర్‌కు వీడియో కాల్ చేసి ఆమె చూస్తుండగానే మర్మాంగాన్ని కట్ చేసుకున్నాడు. వెంటనే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. రూమ్‌లో శపన్ బర్మన్ వచ్చేసరికి అల్లుడు రక్తపు మడుగులో కనిపించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రసన్న జీత్ శస్త్ర చికిత్స చేశారు. ప్రసన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News