అహ్మదాబాద్: ఇన్సురెన్స్ డబ్బుల కోసం స్నేహితుడిని చంపి అనంతరం మృతదేహం తనదేనని నమ్మించాడు. పోలీసుల విచారణలో బయటపడడంతో నిందితుడిని అరెస్టు చేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం గోండాల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మోటా మహికా గ్రామంలో హస్ముఖ్ ధంజా తన భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. రాజ్‌కోటలో సందీప్ గోస్వామి అనే వ్యక్తి తన భార్య గాయత్రి, ఇద్దరు కూతుళ్లతో కలిస ఉంటున్నాడు. ధంజాకు గోస్వామి స్నేహితుడు. ధంజా అప్పులు ఎక్కువగా ఉండడంతో ఇన్సురెన్స్ డబ్బుల కోసం ప్లాన్ వేశాడు. తాను చనిపోతే ఇన్సురెన్స్ డబ్బులు వస్తాయని ఫ్లాన్ వేశాడు. మోతా మహికా గ్రామ శివారులోకి బాలుడు, గోస్వామిని దంజా తీసుకెళ్లాడు. అనంతరం గోస్వామిని గొంతు నులిమి చంపేసి అనంతరం పెట్రోల్ చల్లి తగలబెట్టాడు.
మృతదేహానికి సమీపంలో పాదరక్షలు, పర్సు, మొబైల్‌ను వదిలేసి ధంజా పారిపోయాడు. దంజా సోదరుడు హితేశ్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం తన సోదరుడేదనని చెప్పాడు. ఎవరో తన సోదరుడిని చంపేశారని అనుమానం వ్యక్తం చేశాడు. హస్ముఖ్ నుంచి ఫోన్ కాల్ రావడంతో తన భర్త గోస్వామి బయటకు వెళ్లాడని గాయత్రి పోలీసులకు తెలిపింది. హస్ముఖ్, ధంజా కలిసి వ్యాపారం చేస్తున్నారని గాయత్రి తెలిపింది. సందీప్ గోస్వామిని తన భార్యకు ఫోన్ చేసి తన స్నేహితుడు హస్ముఖ్, మరో వ్యక్తితో కలిసి మోతా మహికా గ్రామానికి వెళ్తున్నామని చెప్పారు. హస్ముఖ్ ది మృతదేహం అనుకుంటే గోస్వామి ఎక్కడికి వెళ్లినట్టు అని పోలీసులు అనుమానించారు. దీంతో మూడో వ్యక్తి బాలుడు ఉండడంతో అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. గోస్వామిని ధంజా హత్య చేసి అనంతరం మృతదేహంపై పెట్రోల్ చల్లి తగలబెట్టాడు. మృతదేహం వద్ద పాదరక్షలు, పర్సు, మొబైల్ వదిలి అక్కడి నుంచి అతడు పారిపోయాడు. గాయత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ధంజాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మర్డర్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కలికాలం కాకపోతే ఇన్సురెన్స్ డబ్బుల కోసం స్నేహితుడిని చంపుతారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.