Wednesday, January 22, 2025

సాహా సూపర్ ఇన్నింగ్స్

- Advertisement -
- Advertisement -

Gujarat solid win over Chennai

ముంబయి: ఈ ఏడాది ఐపిఎల్‌లో గుజరాత్ వరస విజయాలతో దూసుకు పోతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న ఆ జట్టు ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం గుజరాత్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవరలలో విజయం సాధించింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (67 నాటౌట్)అర్ధ శతకంతో రాణించాడు. శుభమన్ గిల్(18), వేడ్(20), డేవిడ్ మిల్లర్(15 నాటౌట్) కూడా తమ వంతు పాత్ర పోషించారు. చెన్నై బౌలర్లలో పతిరాన 2, మొయిన్ అలీఒక వికెట్ తీశారు.

రాణించిన రుతురాజ్

అంతకు ముందు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై బ్యాటర్లు గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో భారీ స్కోరు చేయలేకపోయారు. 5 వికెట్ల నష్టానికి కేవలం 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే అర్ధ శతకం(53)తో రాణించాడు. జగదీశ్వరన్(39 నాటౌట్), మొయిన్ అలీ(21) కొంత మేరకు రాణించినా భారీ స్కోరు మాత్రం చేయలేకపోయారు. డేవన్ కాన్వే(5),శివమ్ దూబే(0), ధోనీ(7)లు విఫలమైనారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ2,రషీద్ కాన్, అల్జారీ జోసెఫ్, సాయి కిశోర్ తలా ఒక వికెట్ సాధించారు. కాగా ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఇది పదో విజయం కాగా, చెన్నైకి తొమ్మిదో పరాజయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News