Monday, December 23, 2024

గుజరాత్ లక్ష్యం 207

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రచిన్ రవీంద్ర, శివమ్ దూబే బ్యాటింగ్‌లో వీరవిహారం చేశారు. దూబే హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. దూబే 23 బంతుల్లో ఐదు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 51 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించారు. చెన్నై బ్యాట్స్‌మెన్లలో శివమ్ దూబే(51), రచిన్ రవీంద్ర(46), రుతురాజ్ గైక్వాజ్(46), డారియల్ మిచెల్ (24), సమీర్ రజ్వీ(14), అజింక్య రహానే(12), రవీంద్ర జడేజా(07 నాటౌట్) పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు, రవి శ్రీనివాసన్ సాయి కిశోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ తలో ఒక వికెట్ తీశారు. ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 29 సార్లు 200 పైగా పరుగులు సాధించిన తొలి జట్టుగా రికార్డులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News