- Advertisement -
గుజరాత్ టైటాన్స్ కు హార్దిక్ పాండ్యా బైబై చెప్పి, ముంబయి ఇండియన్స్ లో చేరిపోయాడు. దీంతో కొత్త కెప్టెన్ ఎంపికపై గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం కసరత్తు చేసి, టీమిండియాలో రికార్డులపై రికార్డులు సృష్టిస్తున్న యువ బ్యాటర్ ని ఎంచుకుంది. అతను ఎవరో కాదు… డేరింగ్ అండ్ డేషింగ్ బ్యాటర్ శుభమన్ గిల్.
హార్దిక్ పాండ్యా నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఒకసారి ఐపిఎల్ ఛాంపియన్ షిప్ ను గెలుచుకుంది. మరోసారి ఫైనల్ వరకూ చేరింది. అయితే హార్దిక్ ముంబయి ఇండియన్స్ లో చేరాలని నిర్ణయించుకోవడంతో అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, భవిష్యత్తులో అతనికి మరిన్ని విజయాలు చేకూరాలని ఆశిస్తున్నట్లు గుజరాత్ టైటాన్స్ జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.
- Advertisement -