అహ్మదాబాద్: ఐపిఎల్‌లో మరో హైటెన్షన్ మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ మధ్య జరిగిన ఉత్కంఠపోరులో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అయితే 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు ఆరంభంలో తడబడ్డారు. 14 పరుగుల జట్టు స్కోర్ వద్ద శుభ్‌మాన్ గిల్(7) రనౌట్ అయ్యిడు. ఈ దశలో బ్యాటింగ్‌కి వచ్చిన జాస్ బట్లర్ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. 54 బంతుల్లో 97 పరుగులు (11 ఫోర్లు, 4 సిక్సులు) చేసి ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరో వైపు అయితే సాయి సుదర్శన్ 36, రూతర్‌ఫోర్డ్ 43 పరుగులు చేసి.. జట్టు విజయంలో తమ వంతు సహకారం అందించారు. ఫలితంగా గుజరాత్ 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి.. 7 వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.
చితక్కొట్టిన బట్లర్.. గుజరాత్ ఘన విజయం
- Advertisement -
- Advertisement -
- Advertisement -