ఐపిఎల్‌లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్‌కు ఇది నాలుగో విజయం కావడం విశేషం. 218 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యా టింగ్‌కు దిగిన రాజస్థాన్ 19.2 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలిం ది. హెట్‌మెయిర్ (52), కెప్టెన్ శాంసన్ (41) మాత్రమే రాణించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చి న జోస్ బట్లర్‌తో కలిసి సుదర్శన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. బట్లర్ ఐదు ఫోర్లతో 36 పరుగులు చేశాడు. ఇక షారుక్ ఖాన్ కూడా ధాటిగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న షారుక్ 20 బం తుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. చివరల్లో రాహుల్ తెవాటియా 12 బంతుల్లో 24 (నాటౌట్), రషీద్ ఖాన్ 4 బంతుల్లో 12 పరుగులు చేయడంతో గుజరాత్ భారీ స్కోరును నమోదు చేసింది.