భోపాల్: కరోనాతో చనిపోయాడనుకున్నవ్యక్తి రెండు సంవత్సరాల తరువాత తిరిగి వచ్చిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. 2021లో కమలేష్ అనే వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో గుజరాత్‌లోని వడోదర ఆస్పత్రిలో చేరారు. కరోనా వైరస్‌తో పోరాడుతూ అతడు చనిపోయాడని ఆస్పత్రి సిబ్బంది కమలేష్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి అంత్యక్రియలు నిర్వహించి తన స్వస్థలాలకు తిరిగి వచ్చారు. రెండు సంవత్సరాల తరువాత తన కుటుంబ సభ్యుడు ఇంటికి తిరిగి రావడంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆస్పత్రి సిబ్బంది చేసిన పొరపాటుతో మరో వ్యక్తికి అంత్యక్రియలు చేశామని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. రెండు సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నావని ప్రశ్నించగా కమలేష్ సరైన సమాధానం చెప్పడం లేదు. కమలేష్‌ను విచారించాక స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. అతడు ఓ గ్యాంగ్ తో కలిసి ఉండడంతో వారు అతడికి మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో తన ఇంటికి రాలేదని సమాచారం.
Also Read: తల్లి మావి నుంచి శిశువుకు కరోనా వైరస్