Monday, January 20, 2025

గుజరాత్ మోడీకి ముందుంది… తర్వాత కూడా ఉంటుంది: ఓవైసీ

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: బిజెపి కొత్త నినాదం “ఆ గుజరాత్ మె బనవ్యూ చ్చె”(నేను గుజరాత్‌ను రూపొందించాను), మోర్బి వంతెన కూలిపోవడంపై మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోడీని ఎంగట్టారు. అహ్మదాబాద్‌లోని మీర్జాపూర్‌లో మజ్లీస్ అభ్యర్థి సబీర్ కాబ్లీవాలా తరఫున ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన ప్రసంగించారు. “ఆయన గుజరాత్‌ను తానే నిర్మించినట్లు చెప్పుకుంటున్నారు. ఆయన పుట్టక ముందు గుజరాత్ లేదా? ఆయన పోయాక గుజరాత్ ఉండదా? ఇప్పుడున్న గుజరాత్‌ను సౌరాష్ట్రకు చెందిన మహిళలు, దంగ్స్ ఆదివాసులు, వడ్గాం దళితులు, పశుకాపారు(మాల్దారీలు), మత్సకారులు రూపొందించారు. అయితే మోడీ ఒకటి చేశారు. అది మోర్బీ వంతెనను నిర్మించారు. అది ఇటీవల కూలిపోయి, 150(135) ప్రాణాలు తీసుకుంది. మీరు(మోడీ) గుజరాత్‌ను రూపొందించలేదు, గుజరాతీలను(రాష్ట్ర ప్రజలను) చవటలను చేశారు. మీరు మోర్బీ వంతెకు సంబంధించిన రంగుల కలలు చూయించారు. ఆ వంతెనను మీరే నిర్మించినట్లు చెప్పుకున్నారు. మరి అది కూలిపోవడానికి కారణం ఎవరు? మోర్బీ వంతెనకు సంబంధించినంత వరకు దేశం ప్రధానిని తప్పక గుర్తుంచుకుంటుంది. మీరు మమ్మలని పిచ్చోల్లను చేస్తున్నారు” అంటూ ఓవైసీ విరుచుకుపడ్డారు. మోర్బీ వంతెన కూలినప్పుడు తౌఫీక్, హుసైన్ అనే ఇద్దరు యువకులు సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకోడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. “మీరు(మోడీ) ‘డిస్టర్డ్ ఏరియాస్ యాక్ట్’ని అమలు చేశారు. దానివల్ల తౌఫీక్, హుసైన్ ఇల్లయినా కొనగలరా?” అని అసదుద్దీన్ ఓవైసీ ప్రధానిని ప్రశ్నించారు. “మీరేమో గుజరాత్‌ను నిర్మించానని డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ మీ ప్రభుత్వం బిల్కిస్ బానో దోషులను నిర్డోషులంటూ విడుదలచేసింది. మేము ఇలాంటి విషయాలు లేవనెత్తినప్పుడల్లా మీరు మావి విచ్ఛిన్నకర ప్రసంగాలంటూ ప్రక్కదారి పట్టిస్తుంటారు” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News