Sunday, December 22, 2024

గుజరాత్ అలవోక విజయం

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఐపిఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మరో విజయం సాధించింది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపు గుజరాత్ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 17.5 ఓవర్లలోనే కేవలం 118 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ శాంసన్ (30) మాత్రమే రాణించగా మిగతావారు విఫలమయ్యారు.

ప్రత్యర్థి జట్టులో రషీద్ ఖాన్ 14 పరుగులకే మూడు వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు కూడా రాణించడంతో రాజస్థాన్ ఇన్నింగ్స్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగన గుజరాత్ 13.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా 41 (నాటౌట్), శుభ్‌మన్ గిల్ (36) జట్టుకు శుభారంభం అందించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హార్దిక్ 15 బంతుల్లోనే 3 సిక్సర్లు, మూడు ఫోర్లతో అజేయంగా 39 పరుగులు చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News