Wednesday, January 22, 2025

కేజ్రీవాల్‌ను గుజరాతీలు నమ్మే ప్రసక్తి లేదు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

Gujarat won't vote for dream sellers: Amit Shah

అహ్మదాబాద్: కలలు అమ్మే వారు గుజరాత్‌లో ఎన్నటికీ గెలవలేరంటూ ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మంగళవారం ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గాంధీనగర్‌లో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్ పద్ధతిలో అమిత్ షా ప్రసంగిస్తూ భూపేంద్ర పటేల్ నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్ ప్రజల గురించి తనకు బాగా తెలుసునని, కలలు అమ్మే వారిని వారు ఎన్నడూ గెలిపించరని అమిత్ షా అన్నారు. పని చేసే వారినే గుజరాతీలు నమ్ముతారని, కలలు అమ్మే వారు గుజరాత్‌లో ఎన్నడూ గెలవలేరని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే ప్రజలు బిజెపి వైపే ఉంటారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయభేరి మోగించనున్నదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Gujarat won’t vote for dream sellers: Amit Shah

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News