Saturday, January 11, 2025

గుజ్జర్ ఉద్యమనేత కిరోరి భైస్లా మృతి

- Advertisement -
- Advertisement -

Gujjar leader Col Kirori Singh Bainsla passed away

జైపూర్ : రాజస్థాన్‌లో ప్రాబల్యపు గుజ్జర్ల ఉద్యమానికి ఆద్యుడు అయిన కిరోరి సింగ్ బైస్లాగురువారం మృతి చెందారు. 84 సంవత్సరాల బైస్లా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రిటైర్డ్ కల్నల్ అయిన కిరోరిని గురువారం చికిత్సకు ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పుడు అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు స్వస్థలం హిందౌన్ సిటీలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజస్థాన్‌లో కోటా ఉద్యమం ఆయన ఆధ్వర్యంలో 2007లో తీవ్రస్థాయిలో సాగింది. మూడు దశాబ్దాల పాటు సైన్యంలో వివిధ హోదాలలో పనిచేసిన కిరోరిసింగ్ రిటైర్ అయిన తరువాత తన వర్గానికి రిజర్వేషన్ల కల్పనకు ఉద్యమం చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News