లక్నో: ఐపిఎల్ 18వ సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న పోరులో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్‌లు మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కి 120 పరుగులు జోడించడమే కాకుండా.. ఇరువురు అర్థ శతకాలు సాధించారు. అయితే అవేశ్ ఖాన్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి గిల్(60), ఆ తర్వాత రవి బిష్ణోయ్ వేన 14వ ఓవర్ తొలి బంతికి సుదర్శన్(56) పెవిలియన్ చేరారు. ఆ తర్వాత అదే ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్(2) ఔట్ అయ్యాడు.
ఈ క్రమంలో గుజరాత్ ఆటగాళ్లను లక్నో బౌలర్లు కట్టడి చేశారు. బట్లర్ 16 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆ తర్వాత రూతర్‌ఫోర్డ్ జట్టు స్కోర్‌ను పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్‌లో రూతర్‌ఫోర్డ్(22), రాహుల్(0) వరుస బంతుల్లో ఔట్ అయ్యారు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో బౌలింగ్‌లో ఠాకూర్, బిష్ణోయ్ చెరి రెండు దిగ్వేష్, అవేశ్ తలో వికెట్ తీశారు.