- Advertisement -
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మూడు వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ జట్టు ఈ మ్యాచ్‌లో అయినా విజయం సాధించి కాస్త పుంజుకోవాలని భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో జోరు మీద ఉన్న గుజరాత్ ఈ మ్యాచ్‌తో హ్యాట్రిక్ సాధించాలని అనుకుంటోంది. ఇక ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. సన్‌రైజర్స్‌లో హర్షల్ పటేల్ స్థానంలో జయదేవ్ ఉనద్కట్ జట్టులోకి రాగా.. గుజరాత్ జట్టులో అర్షద్ ఖాన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు.
- Advertisement -