- Advertisement -
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆర్‌సిబి.. ఈ మ్యాచ్‌తో హ్యాట్రిక్ విజయాలను అందుకోవాలనే ఉత్సాహంలో ఉంది. ఇక పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన గుజరాత్.. ముంబైతో జరిగిన రెండో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి అదే జట్టుతో బరిలోకి దిగుతుండగా.. గుజరాత్ జట్టులో ఒక మార్పు చేసింది. కగిసో రబాడా స్థానంలో అర్షద్ ఖాన్‌ని జట్టులోకి తీసుకుంది.
- Advertisement -