- Advertisement -
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చేసిన గులాం నబీ ఆజాద్ నేడు(ఆదివారం) కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. ఆయన ఇందుకోసం ఢిల్లీ నుంచి జమ్మూకు చేరుకున్నారు. ఆయన మద్దతుదారులు ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. గులాం నబీ ఆజాద్‌కు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో సంబంధం ఉంది. ఆయన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై గుర్రుగా ఉన్నారు. రాహుల్ గాంధీ వల్లే పార్టీ పతనమైందంటూ ఆయన ఈ మధ్య విమర్శలు కూడా గుప్పించారు.
2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆజాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన కన్నా ముందు పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్, పార్టీ పంజాబ్ చీఫ్ సునీల్ జకర్, మాజీ మంత్రులు కపిల్ సిబాల్, అశ్వనీ కుమార్ వంటి ప్రముఖులు కూడా రాజీనామా చేశారు.
- Advertisement -