Wednesday, April 16, 2025

ఉరేసుకుని గల్ఫ్ బాధితుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

దుబాయ్ పంపిస్తానని ఏజెంట్, మధ్యవర్తుల మోసంతో వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి అక్కన్నపేట మండలం పోతారం (జె) గ్రామపంచాయతీ పరిధిలోని తురకవానికుంటకు చెందిన బోడ శ్రీనివాస్‌రెడ్డి (40) అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గల్ఫ్ పంపిస్తానని సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ఓ వ్యక్తి రూ. 4 లక్షలు తీసుకున్నాడని, అప్పుడు ఇప్పుడంటూ కాలయాపన చేస్తూ దాటవేయడంతో మనస్థాపానికి గురయ్యాడు. తీసుకున్న డబ్బులకు మిత్తిలు పెరిగాయనుకుంటే దానికి అంతకుముందే తీసుకున్న రూ.8 లక్షలు కూడా తోడు కావడంతో ఏమి చేయాలో తోచక

సోమవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు బయట నిద్రస్తుండగా ఇంటి లోపలికి వెళ్లి గడియ పెట్టుకొని సూసైడ్ నోట్ రాసి ఫ్యానుకు చీరతో ఉరివేసుకున్నాడు. ఇంట్లో శబ్దం రావడంతో మేలుకువ వచ్చిన భార్య తన భర్త కనిపించ పోవడంతో ఇంటి లోపల చూసేందుకు ప్రయత్నించింది కానీ లోపల గడియ పెట్టి ఉందని గ్రహించి చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు తెరిచి చూడగా శ్రీనివాస్‌రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హుటాహుటిన హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అక్కడికక్కడే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఇదిలా ఉండగా సూసైడ్ నోట్ లో మోసం చేసిన మధ్యవర్తిని వదిలిపెట్ట వద్దని పోలీసులకు విన్నవించుకున్నాడు. తన పిల్లలను మంచిగా చూసుకోవాలని బామ్మర్దులను వేడుకున్నట్లు అందులో పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News