ఏ టూటే దరవాజే ,
టూటే చార్పాయీ
అఉర్ తూటి చత్ …
మాలూం హోతా హై కిసీ
ఇమాన్దార్ క ఘర్ హై…
విరిగిపోయిన
ఈ తలుపులు
కీళ్లు సడిలిన మంచం
శిథిలమైన పైకప్పు
చూడబోతే ఇదేదో
నిజాయితీపరుని
ఇల్లులాగుందే
హజారో ..
ఉల్ఝానే రాహో మే అఉర్
కోశిశే బెహిసాబ్ ..
ఇసీ కా నాం హై
జిందగీ ..
చల్తే రహియే జనాబ్
వేనవేల ఆటంకాలు మన తోవలో
లెక్కలేనన్ని ప్రయత్నాలూ
సాగిపోతూ ఉండాలి మరి
జీవితమంటే ఇదేగా మిత్రమా
ఆశియానా బనాయే భి తో
కహా బనాయే జనాబ్ ,,
జమీన్ మహేంగీ హోగాయీ హై అఉర్ ,,
దిల్ మే కోయి జగః నహీ దేతా
ఏర్పాటు చేసుకోవాలి ఇల్లు అనుకున్నా
ఎక్కడ వీలవుతుంది మిత్రమా
భూమి ధర
ఆకాశాన్నంటుతోంది
తమ హృదయంలోనెమో చోటివ్వరెవ్వరూ
జిస్ ఇన్సాన్ కే
బినా హం ఏక్ పల్నహీ రహే సకతే
వహీ ఇన్సాన్ హమే అకేలే
రహేనా సిఖా దేతా హై ….
ఏ మనిషిని వదిలి మనమొక్క క్షణం
కూడా ఉండలేకపోతామో
ఆ మనిషే కదా మనకు
ఒంటరిగా జీవించడం నేర్పించేస్తాడు