మై బికారీ తక్ బన్ జావూ
తుఝే పానే కి ఖాతిర్
కోయి డాలే తో సహీ
తుజ్హే మేరీ ఝోలీ మే
నిన్ను పొందడానికి
బిచ్చగాడిని అయినా అవుతా
అప్పుడన్నా ఎవరో ఒకరు
నిన్ను నా జోలిలో వెయ్యకపోతారా
తస్వీర్ లేనా భీ జరూరీ
హై జిందగీ మే సాహెబ్
ఆయినే గుజ్రా హువా వక్త్
నహీ బతాయా కర్తే
ఫోటోలు దిగడం కూడా
అవసరమే జీవితంలో
ఎందుకంటే అద్దం
గడిచిన కాలాన్ని
చూపించదు మిత్రమా
క్యా లూటేగా జమానా
హమారీ ఖుశియోంకో
హం తో ఖుద్ హీ ఖుషియా
దూశ్రో పర్ లుటాకే జీతే హై
నా సంతోషాన్ని ఈ ప్రపంచం
ఏం దోచుకుంటుంది లే
నేనే స్వయంగా నా సంతోషాలన్నీ
వేరే వాళ్లకు ఇచ్చేసాక
జిందగీ ఏ తేరే ఖరోచే హై
ముఝ్ పర్ యా
ఫిర్ తూ ముజ్హే తరాశ్నే..
కి కోషిష్ మే హై
ఓ జీవితమా ఇవి
నా వొంటి మీద నువ్వు
చేసిన గాయాలా లేక..
నన్ను సాన బట్టే
ప్రయత్నమా ?
అప్నో నే హీ సిఖాయా
కి కోయీ అప్నా నహీ హోతా
నా వాళ్ళే నేర్పించారు
నా అనే వాళ్ళు ఉండరని
బొమ్మలు: దేవులపల్లి శృతి
అనువాదం: దేవులపల్లి అమర్