- Advertisement -
ముస్కురాతే బోహాత్
హో తుమ్
కభీ ఖుష్ భి
రహా కరో.
ఎక్కువగా చిరునవ్వు
నవ్వుతూనే వుంటావ్
సంతోషంగా కూడా
ఉండరాదూ
ఎప్పుడైనా
జో సహెనా
సీఖ్ జాతే హై
ఫిర్ కహెనా
చోడ్ దేతే హై
ఏదైనా భరించడం
నేర్చేసుకున్న వాళ్ళు
మాట్లాడడమే
మర్చిపోతారేమో ఇక
కుచ్ రిషతే బచానే కె లియే
వసూల్ తోడి హం నే
జహా గల్తీ నహీ థీ
వహా భి హాత్ జోడి హం నే
కొన్ని బంధాలను నిలుపుకోడానికి
నీళ్లొదిలాను నియమాలకునేను
తప్పేమీ
లేకపోయినా నాది
అక్కడా చేతులు
జోడించాను
తుమారీ ఆదత్ సీ
హోగయీ థీ హమే
మాలూం తో హమే భి థా
కే తుమ్ నసీబ్ మే నహీ
అలవాటుగా మారిపోయావు
నీవు నాకు నాకెప్పుడో తెలుసు
నీవు నా నుదుటి
మీది అదృష్టపు
గీతల్లో లేవని
అనువాదం: దేవులపల్లి అమర్
బొమ్మలు: దేవులపల్లి శృతి
- Advertisement -