Monday, April 21, 2025

గుల్జార్‌కి గలియోమె

- Advertisement -
- Advertisement -

తుమ్ నే తో కహా థా
హర్ షాం హాల్ పూచెంగే
తుంహారా తుమ్ బదల్ గయే హో
యా తుంహారే షేహర్ మె షామ్ నహి హోతి

అన్నావు కదా నీవే ప్రతి సాయంత్రం
నీ యోగక్షేమాలు విచారిస్తానని
మరి నువ్వే మారిపోయావా లేదూ
మీ వూళ్ళో అసలు సాయంత్రాలే లేవా

కాంటో పర్ భి దోష్
కైసా డాలే జనాబ్
పైర్ తో హం నే రఖా
వో అప్నే జగహ్ పర్ థే

ఎట్లా నిందించగలం ముళ్ళనైనా
అవి వాటి జాగాలోనే ఉన్నయ్
మనం కదా వాటి మీద కాలుమోపింది

భీడ్ కాఫీ హువా కర్తీ థీ
మహేఫిల్ మె మేరీ…
ఫిర్ మై ‘సచ్ ‘బోల్తా గయా
ఔర్ లోగ్ ఉట్తే చలే గయే

ఉండేవారు చాలామందే నా సమావేశ సమూహాల్లో
నిజం చెప్పడం మొదలుపెట్టగానే
నేను లేచి వెళ్లిపోయారంతా ఒక్కొక్కరే

ఆంఖో కే పర్దే భీ నమ్ హో గయే హై
బాతో కే సిల్సిలే భి కమ్ హో గయే హై
పతా నహీ గల్తీ కీస్కీ హై
వఖ్త్ బురా హై యా బురే హమ్ హోగయే హై

చెమ్మగిల్లాయి కంటి పై పొరలు
మందగించాయి మాటల పరంపర
తప్పెవరిదని అనగలం
తప్పు కాలానిదా లేక నేనే అయ్యానా చెడ్డవాణ్ని

Gulzar's Galliome

కభీ పత్తర్ కే టోకర్ సే భి
నహి ఆతీ ఖరోచ్
కభీ జరాసీ బాత్ సే ఇన్సాన్
బిఖర్ జాతా హై

దెబ్బేమీ తగలదు కొన్ని సార్లు
రాయి కొట్టుకున్నా
కొన్నిసార్లు మాత్రం చిన్న మాటకే
చెల్లాచెదురైపోతాడు మనిషి

అనువాదం: దేవులపల్లి అమర్

బొమ్మలు: దేవులపల్లి శృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News