Sunday, January 19, 2025

సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన గుమ్మడి వెన్నెల గద్దర్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా ప్రభుత్వానికి
పేరు, ప్రతిష్టలు తీసుకొస్తానని హామీ
మనతెలంగాణ/హైదరాబాద్: తనపై నమ్మకంతో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గుమ్మడి వెన్నెల గద్దర్ కృతజ్ఞతలు తెలిపారు. తన పదవికి సహకరించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్లమెంటు సభ్యుడు మల్లు రవి, మంత్రులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహలకు ఓ ప్రకటనలో ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన పదవికి న్యాయం చేస్తానని, తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను, వృత్తి కళాకారులను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తానని ఆమె హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News