Thursday, January 23, 2025

కాలిఫోర్నియాలో తుపాకుల మోత.. తల్లి, 6నెలల బిడ్డతోపాటు ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. సోమవారం తెల్లవారుజామున కాలిఫోర్నియాలోని ఓ ఇంటిపై కొంతమంది దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి, 6 నెలల పాపతోపాటు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుండగులు, కుటుంబాన్ని టార్గెట్ చేసి కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News