Monday, November 18, 2024

పాతబస్తీలో కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఆస్తి విషయంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదం కాల్పులకు దారితీయడంతో పాతబస్తీలోని మీర్‌చౌక్‌లో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. కాల్పులకు పాల్పడిన వ్యక్తితో పాటు మరొక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. షాహబ్‌జాదా మీర్ మసూద్ అలీఖాన్ న్యాయవాది, ముర్తజా అలీఖాన్( ఐటి ఇంజనీర్), హస్మత్‌ఉన్నీసా బేగం. వారసత్వంగా తమకు వచ్చిన ఇల్లు మగర్ కి బౌలీలో ఉండడంతో దానిలో షాహబ్‌జాదా మీర్ మసూద్ అలీఖాన్ తన సోదరుడు ముర్తజా అలీఖాన్, తల్లి హస్మత్ ఉన్నీసా బేగంతో కలిసి ఉంటున్నాడు. ఇందులోని కొంత భాగాన్ని తన వీరి బంధువు, ఆస్తికి లీగల్ హెయిర్ అయిన సహబ్‌జాదా మీర్ అహ్మద్ వేరే వారికి విక్రయించాడు.

అప్పటి నుంచి ఇంటిపై వివాదం నడుస్తోంది. ఇరువర్గాలు పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. కోర్టులో కేసులు వేయడంతో కేసు నడుస్తోంది. తమకు తెలియకుండా ఎలా విక్రయిస్తారని షాహజ్‌జాదా మీర్‌మసూద్ అలీఖాన్ కుటుంబం గొడవపడుతున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు కలిసి ఇంటి వద్దకు వచ్చి అందులో అద్దెకు ఉంటున్న వారితో శనివారం రాత్రి గొడవ పెట్టుకోని దాడి చేశారు. దాడిలో అద్దెకు ఉంటున్న సుల్తానాల, హసీనా బేగం, ఇబ్రహిం, రెహ్మన్, సోహైల్ ఖాన్ గాయపడ్డారు. బెదిరించేందుకు న్యాయవాది తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో ఇరువర్గాలకు చెందిన వాళ్లు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News