- Advertisement -
హైదరాబాద్: నగరంలోని గుడిమల్కాపూర్‌లో ఓ దుకాణదారుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. స్థానికంగా ఉన్న కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న ‘ఆనం మీర్జా’ ఎక్స్‌పో ఇద్దరు దుకాణదారుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త పెద్దది కావడంతో ఓ దుకాణదారుడు గాల్లో కాల్పులు జరిపాడు. దీంతో అక్కడకు వచ్చిన సందర్శకులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రదర్శనలో పోలీసులు మరింత భద్రత పెంచారు.
- Advertisement -