Saturday, December 21, 2024

అమెరికాలో మళ్లీ తుపాకుల మోత.. ఏడుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

హాఫ్ మూన్ బే(అమెరికా): అమెరికాలో సోమవారం రెండు వేర్వేరు లింక్‌లున్న కాల్పుల ఘటనల్లో ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు. కాలిఫోర్నియా కమ్యూనిటీ ప్రాంతంలో ఓ పుట్టగొడుగుల సంస్థ, ఓ ట్రక్కింగ్ కంపెనీలలో కాల్పులు జరిగాయి. శాన్ ఫ్రాన్సిస్‌కో దక్షిణంలో తీర ప్రాంతం వెంబడి ఘటనలు జరిగాయని అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనల్లో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారని వివరించారు.

హాఫ్ మూన్ బే శివార్లలో ఘటనలు జరిగాయి. దీనికి సంబంధించి 67 సంవత్సరాల వ్యక్తి ఛునిలి జావో అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వ్యాపార వ్యవహారాలకు సంబంధించే ఈ కాల్పుల ఘటనలు జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు. కాల్పులకు దిగిన వ్యక్తి కంపెనీలో పనిచేసి వెళ్లిన ఉద్యోగి అని వెల్లడైంది. అమెరికాలో ఈ ఏడాది ఆరంభం నుంచి జరిగిన ఆరవ భారీ సామూహిక హత్యాకాండగా ఇప్పటి ఘటన రికార్డుల్లో చేరింది. శనివారం రాత్రి సదర్న్ కాలిఫోర్నియాలో బాల్‌రూం డాన్స్ హాల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 11 మంది మృతి చెందారు. ఇప్పుడు జరిగిన రెండు కాల్పుల ఘటనకు సంబంధం ఉందని తెలిపిన పోలీసు అధికారి వివరాలను వెల్లడించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News