Wednesday, January 22, 2025

కామారెడ్డిలో నాటు తుపాకీ పేలి వేటగాడు మృతి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి జిల్లాలో నాటు తుపాకీ పేలి గురువారం వ్యక్తి మృతి చెందాడు. వన్యప్రాణుల వేటలో నాటు తుపాకీ పేలి వేటగాడు ప్రాణాలు కోల్పోయాడు. ముగ్గురు వేటగాళ్లు సిరికొండ అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లారు. వేట నుంచి తిరిగివస్తుండగా ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలింది. ఈ ప్రమాదంలో మాచారెడ్డి మండలం సోమరిపేట వాసి రావోజీ మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News