Wednesday, January 22, 2025

అమెరికాలో కాల్పుల కలకలం..

- Advertisement -
- Advertisement -

అమెరికా: అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలోని లూయూవిల్ లో కాల్పుల కలకలం చోటు చేసుకేుంది. ఓ వ్యక్తి తుపాకితో స్థానిక జనంపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పోలీస్ అధికారితో సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా  పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడు కూడా మృతి చెందాడు. దుండగుడు అజయ్ బ్యాంక్ మాజీ ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. ఘటనకు గల కారణాలను పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News