Saturday, January 11, 2025

మునుగోడులో కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

8 Shot dead and 16 Injured in Chicago

నల్లగొండ: ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామ సమీపంలో గురువారం రాత్రి  జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  నార్కట్ పల్లి మండలం బ్రహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో పాటు మునుగోడులో కూల్ డ్రింక్స్, నీళ్ల బాటిళ్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణం మూసేసి బైక్ పై లింగస్వామి ఇంటికి వెళ్తుండగా సింగారం గ్రామ శివారులో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి అతడిపై కాల్పులు జరిపారు.  లింగస్వామి మృతి చెందాడని నిర్ధారించుకున్న తరువాత దుండగలు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. కాల్పుల శబ్ధం విన్న ఒక వ్యక్తి అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సదరు వ్యక్తిని అంబులెన్స్ లో నార్కట్ పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. లింగస్వామి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రికి వర్గాలు వెల్లడించాయి. డిఎస్ పి నర్సింహరెడ్డి కామినేని ఆస్పత్రి చేరుకొని బాధితుడితో మాట్లాడారు. కొందరిపై అనుమానం ఉందని లింగస్వామి చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని డిఎస్ పి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News