Monday, January 20, 2025

ఫైర్‌గన్‌తో ఆటలాడితే అట్లుంటది!

- Advertisement -
- Advertisement -

ముంబై: పెళ్లి జరిగాక, జరగక ముందు ఫైర్‌గన్‌తో ఫోటోలు దిగడం కొందరి ఆటయిపోయింది. అయితే అదంత క్షేమదాయకం కాదని ఇటీవల ఓ ఉదంతంతో వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో కొత్తగా పెళ్లిచేసుకున్న దంపతులు స్పార్కల్ గన్‌లతో ఫోజులిస్తూ ఫోటోలు దిగారు. ఆ తర్వాత ఆ తుపాకులను పైకి కాల్చారు. ప్రేక్షకులు వూ…వావ్…అంటూ పిల్లికూతలు పెట్టారు. చివరికి వేడుక విషాధంగా మారిపోయింది.

వధువు పేల్చిన తుపాకీ మంటలు ఆమె మీదకే రివర్స్ అయ్యాయి. దాంతో ఆమె భయపడిపోయి తుపాకీని కింద పారేసింది. భయంతో అరిచింది. మెడలో ఉన్న వరమాల కూడా తగులబడుతుందేమోనని తీసేసింది. ఆ తర్వాత వధువును కాపాడేందుకు అంతా పరుగులుపెట్టారు. ఈ వీడియోను మొదట యూటూబ్‌లో షేర్ చేశారు. ఇది మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఉన్న జున్నార్ నగరానికి చెందిన ఉదంతం. తర్వాత ఈ వీడియో ట్విటర్‌లో కూడా పెట్టారు. కానీ వారి స్టంట్ ఫోజుల తీరును చాలామంది విమర్శించారు. దేనికైనా లిమిట్ అనేది ఉంటుందని జనాలు ఎప్పుడు గుర్తిస్తారో?

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News