Sunday, January 19, 2025

కాన్సాస్ సిటీలో తుపాకీ కాల్పులు.. ఒకరు మృతి, 21 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

కాన్సాస్ సిటీ (అమెరికా): అమెరికా లోని మిస్సోరి రాష్ట్రంలో కాన్సాస్ సిటీలో బుధవారం జరిగిన కవాతులో కాల్పులు చోటు చేసుకుని 22 మంది గాయపడగా ఒకరు మరణించారు. గాయపడిన వారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. అమెరికాలో సూపర్ బౌల్ ఫైనల్ జరిగింది. అందులో కాన్సాస్ సిటీ చీఫ్స్ జట్టు విజయం సాధించింది. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకుని కాన్సాస్ సిటీలో పెరేడ్ నిర్వహిస్తుండగా కాల్పులు జరిగాయి.

ఈ పెరేడ్ మార్గం సమీపంలో ఉన్న పెట్రోల్ పంపు నుండి కాల్పుల శబ్దం వినిపించింది. తూటాలు పేలిన వెంటనే జనం భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపు లోకి తీసుకున్నట్టు కాన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ స్టేసీ గ్రేవ్స్ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అనుమానితుడు ఒకరిని ఫ్యాన్స్ పట్టుకున్నట్టు తనకు తెలిసిందని ఆమె చెప్పారు. ఈ దాడికి కారణాలు ఇంకా తెలియరాలేదని ఆమె తెలిపారు. కాన్సాస్ సిటీ తుపాకీ సంస్కృతితో గత కొన్నాళ్లుగా చెలరేగుతోంది. 2023లో ఇక్కడ 182 హత్యలు జరిగాయి. వీటిలో చాలావరకు తుపాకీ కాల్పుల సంఘటనలే ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News