Tuesday, January 21, 2025

ఉన్మాది కాల్పులకు 10 మంది బలి

- Advertisement -
- Advertisement -

Gunman in Montenegro kills 10

మాంటెనీగ్రోలో దారుణ ఘటన

సెటింజె(మాంటెనీగ్రో): నగర వీధుల్లో శుక్రవారం ఒక వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో ఇద్దరు పిల్లలతోసహా 10 మంది మరణించారు. కాగా.. అక్కడే ఉన్న ఒక పౌరుడు జరిపిన కాల్పులలో హంతకుడు కూడా హతమయ్యాడు. కాల్పులు జరిపి 10 మంది మరణానికి కారకుడైన వ్యక్తికి 34 సంవత్సరాలు ఉంటాయని, అతడిని విబి(ఆంగ్ల అక్షరాలు) అనే అక్షరాల ఆధారంగానే గుర్తించగలిగామని మాంటెనీగ్రో పోలీసు అధిపతి జోరన్ బ్రాడ్‌జానిన్ తెలిపారు. సెటింజె నగర శివార్లలోని మెడోవినాలో తన ఇంట్లో అద్దెకు నివసించే ఒక తల్లిని, 8, 11 సంవత్సరాల వయుసుగల ఆమె ఇద్దరు పిల్లలను హంతకుడు వేట తుపాకీతో కాల్చిచంపాడని, అనంతరం వీధిలోకి వచ్చి మరో 13 మంది పౌరులపై కాల్పులు జరిపాడని పోలీసు చీఫ్ చెప్పారు. ఈ కాల్పులలో 10 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని ఆయన తెలిపారు. విబి ఈ ఘాతుకానికి పాల్పడడం వెనుక కారణం తెలియరాలేదని ఆయన చెప్పారు. అక్కడే ఉన్న ఒక పాదచారుడు జరిపిన కాల్పులలో హంతకుడు కూడా మరణించాడని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News