Tuesday, December 24, 2024

అమెరికాలో కాల్పులు.. ముగ్గురు నల్లజాతీయుల మృతి

- Advertisement -
- Advertisement -

జాక్సన్‌విల్లె ( అమెరికా ) : అమెరికా లోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్‌విల్లెలో శనివారం డాలర్ జనరల్ స్టోర్ వద్ద ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు నల్లజాతీయులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. ఇది కేవలం జాతివిద్వేష ప్రేరిత చర్యగా స్థానిక షెరీఫ్ వ్యాఖ్యానించారు. ఈ సంఘటన తరువాత ఆ ఆగంతకుడు తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగంతకుడు కేవలం నల్లజాతీయులపై ఉన్న జాత్యహంకారం కారణం గానే కాల్పులకు పాల్పడ్డాడని, కాల్పులకు మరే కారణం కనిపించలేదని షెరీఫ్ టికె వాటర్స్ పాత్రికేయులకు వివరించారు. హంతకుడు 20 ఏళ్లవాడని, గ్లాక్ హేండ్‌గన్, ఎఆర్ 15 సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో స్టోర్ వద్దకు వచ్చాడని షెరీఫ్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News