Monday, December 23, 2024

ప్రేగ్ యూనివర్సిటీలో దుండగుడి కాల్పులు

- Advertisement -
- Advertisement -

ప్రేగ్: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లోని ఓ యూనివర్సిటీలో గురువారం సాయుధ దుండగుడు జరిపిన కాల్పుల్లో 11 మంది చనిపోగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కాగా కాల్పులు జరిపిన దుండగుడ్ని ఆ తర్వాత పోలీసులు కాల్చి చంపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అంతమొందించినట్లు చెక్ పోలీసులు ధ్రువీకరించారు కానీ చనిపోయిన, గాయపడిన వారికి సంబంధించిన వివరాలు మాత్రం తెలుపలేదు.‘ కల్పులు జరిపిన వ్యక్తిని అంతమొందించాం. మొత్తం బిల్డింగ్‌ను ఖాళీ చేయించాం. చాలా మంది చనిపోయారు, డజన్ల సంఖ్యలో గాయపడ్డారు’ అని మాత్రమే వారు చెప్పారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఘటనా స్థలంలో చనిపోయిన వారు, క్షతగాత్రులు ఉన్నారు’ అని చెక్ పోలీసు అధికారి ఒకరు సోషల్ మీడియాలో తెలిపారు.

కాగా ఘటన జరిగిన ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టడం జరిగిందని, చుట్టుపక్కల ఉన్న వీధుల్లో ఉంటున్న వారిని కూడా ఖాళీ చేయిస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటయిన పాతనగరం ప్రాంతంలో ఉన్న చార్లెస్ యూనివర్సిటీకి చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్ భవనంలో ఈ కాల్పుల ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసుల యాక్షన్ ఇంకా కొనసాగుతున్నందున ఇళ్లలోంచి బైటికి రావద్దని కాల్పులు జరిగిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న పౌరులను హెచ్చరించినట్లు వారు చెప్పారు. కాల్పులు జరిపిన ఓ వ్యక్తిని కాల్చి చంపినట్లు చెక్ హోం మంత్రి రకుసన్ స్థానిక మీడియాకు చెప్పారు. ఘటనా స్థలంలో సాయుధులు మరెవరూ లేరని కూడా ఆయన చెప్పారు. అంతేకాదు అధికారులకు సహకరించాలని ఆయన స్థానికులను కోరారు. చార్లెస్ యూనివర్సిటీకి చెందిన ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్ మొత్తాన్ని ఖాళీ చేయిస్తున్నట్లు ప్రేగ్ నగర మేయర్ బొహుస్లావ్ స్వొబోడా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News