Saturday, December 21, 2024

కరోలినాలో దుండగుడి కాల్పులు

- Advertisement -
- Advertisement -

Gunman shooting in Carolina

అధికారితో సహా ఐదుగురి మృతి

రాలీ: కరోలినాలో దుండగుడు విచక్షణరహితంగా కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. గురువారం అనంతరం తప్పించుకుని పారిపోయిన నిందితుడిని అతడి ఇంటివద్ద పోలీసులు అరెస్టు చేశారు. కాల్పుల్లో విధి నిర్వహణలో లేని పోలీస్ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. షూటర్‌ని ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. మారణకాండకు పాల్పడిన వ్యక్తి మైనర్ అని శ్వేతజాతీయుడిగా పేర్కొన్న పోలీసులు ఇతర వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనపై రాలే మేయర్ మేరీ అన్ బాల్డిన్ మాట్లాడుతూ ఐదుగంటల ప్రాంతంలో నీస్ నదీ తీరప్రాంతంలోని ప్రాంతంలో నిందితుడు కాల్పులు జరిపాడన్నారు. అనంతరం ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీస్ దళాలు ఇంట్లోనే ఉండాలని హెచ్చరించి ఇంటిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారన్నారు. ఏ కారణంతో నిందితుడు కాల్పులు జరిపింది పోలీసులు వెల్లడించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News