Sunday, December 22, 2024

ప్రయాణికుల వాహనాలపై దుండగుల కాల్పులు..38 మంది మృతి

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ గిరిజన ప్రాంతంలో ప్రయాణికుల వాహనాలపై సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ప్రావిన్సులోని కుర్రం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. కుర్రం జిల్లాలో వర్గాల మధ్య ఘర్షణలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఓ కీలకమైన రహదారిని కొన్ని వారాల పాటు మూసివేయగా, దానిని ఇటీవల తెరిచారు. ఈ మార్గం లోనే పరాచినార్ నుంచి పెషావర్‌కు ప్రయాణికులతో వెళ్తోన్న వాహనాలను లక్షంగా చేసుకొని సాయుధ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ సంఘటనలో బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ నదీమ్ అస్లాం చౌధ్రీ ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News