Wednesday, January 22, 2025

ఐఎస్ విచక్షణారహితంగా కాల్పులు..14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

అఫ్ఘానిస్తాన్‌లోని షియా ప్రాబల్య ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ గ్రూపునకు చెందిన ఒక ఉగ్రవాది జరిపిన కాల్పులలో 14 మంది పౌరులు మరణించారు. ఈ ఏడాది అఫ్ఘాన్‌లో జరిగిన అత్యంత దారుణ మారణకాండగా ఈ దాడిని మీడియా వర్ణిస్తోంది.. గురువారం జరిగిన ఈ డాడిలో షిమా ప్రాబల్యంగల ఘోర్, దైకుండి ప్రావిన్సుల మధ్య ప్రయాణిస్తున్న పౌరులు మరణించారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు ఐఎస్ గ్రూపు ప్రకటించింది. మిషన్ గన్‌తో కాల్పులు జరిపినట్లు కూడా ఐఎస్ తెలిపింది. తాలిబాన్ దాడిలో కన్నా ఎక్కువ మంది ఐఎస్ దాడిలో మరణించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News