Thursday, January 23, 2025

మెక్సికోలో కాల్పులు… 19 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Gunmen kill 19 in Michoacan state

 

మెక్సికోసిటీ : సెంట్రల్ మెక్సికో లోని మిచోవాకాన్ స్టేట్ పరిధిలో ఉన్న లాస్ టినాజస్ పట్టణంలో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అధికారుల సమాచారం ప్రకారం సోమవారం ఉదయం (భారత కాలమానం) ఈ ఘటన జరిగింది. కొందరు గాయపడగా ఆస్పత్రిలో చేర్చారు. స్థానికంగా ఒక వేడుక సందర్భంగా ఈ కాల్పులు జరిగాయి. కాల్పులకు కారణాలు ఇంకా తెలియరాలేదు. మెక్సికోలో ఎక్కువ హింస జరిగే ప్రాంతాల్లో మిచోవాకాన్ ఒకటి. ఇక్కడ రెండు వర్గాలు నిత్యం కాల్పులకు పాల్పడుతుంటారు. 2006 నుంచి ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో దాదాపు 3,40,000 మందికి పైగా మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News