Sunday, April 6, 2025

ఏడుగురిని కాల్చి చంపిన కిరాతకుడు

- Advertisement -
- Advertisement -

పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఏడుగురిని వరుసగా నిలబెట్టి కాల్చి చంపిన దారుణ సంఘటన జరిగింది. బలూచిస్థాన్ లోని రక్నీలో ఈ సంఘటన జరిగింది. పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన 45 మంది బస్సులో ప్రయాణిస్తుండగా, ఓ దుండగుడు బస్సు ఆపి టైర్లలో గాలి తీసేశాడు. బస్సులోకి చొరబడి అందర్నీ గుర్తింపు కార్డులు చూపించాలని డిమాండ్ చేశాడు. తరువాత ఏడుగురిని బస్సు లోంచి దింపి వరుసగా నిలబెట్టి కాల్చి చంపేశాడు. ఈ దాడిని తామే చేసినట్టు ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదని అక్కడి సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు. ఇటీవల పాక్ సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ ) భారీ ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో ఆరుగురు సైనికులు మరణించారని ఇస్లామాబాద్ పేర్కొంది. 47 మందిని మట్టుబెట్టామని బలోచిస్థాన్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News