Thursday, March 13, 2025

ఎపి హైకోర్టులో పోసానికి ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

సిఐడి పీటీ వారెంట్‌కు బ్రేక్ వేయాలన్న పోసాని కృష్ణమురళి ప్రయత్నం విఫలమైంది. ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను ఎపి హైకోర్టు కొట్టివేసింది. సిఐడి పిటి వారెంట్ ను రద్దు చేయాలన్న ఆయన విజ్ఞప్తిని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయంతో పోసాని తీవ్ర నిరాశకు గురయ్యారు. పోసానిని ఇప్పటికే పీటీ వారెంట్‌పై కర్నూలులో అదుపులోకి తీసుకున్నామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియజేశారు. ఆయన్ని మంగళగిరి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు కర్నూలు నుంచి తీసుకువస్తున్నట్టు పిపి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పోసాని పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News