Friday, December 20, 2024

కన్న కూతురిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి కాలయముడయ్యాడు. తండ్రి మూడేళ్ల కన్న కూతురుని నేలకేసి కొట్టి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నవులూరు గ్రామానికి చెందిన గోపీ, మౌనికను మూడు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు రెండు సంవత్సరాల పాప లక్ష్మీపద్మావతి ఉంది.

ఆరు నెలల క్రితం మరో పాప జన్మించడంతో అప్పటి నుంచి ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో లక్ష్మీపద్మావతి చేయి పట్టుకొని నేలకేసి కొట్టాడు. కూతురు తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తల్లి తరలించింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే పాప చనిపోయిందని వెల్లడించారు. మద్యం మత్తులో వీరంగం చేస్తున్న గోపిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.  తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News