Sunday, December 22, 2024

అమెరికాలో రోడ్డు ప్రమాదం… గుంటూరు యువతి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలోని జరిగిన కారు ప్రమాదంలో తెలుగు యువతి మృతి చెందింది. ఎపిలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన హారిక అనే యువతి కారులో తన స్నేహితులతో కలిసి వెళ్తుండగా వెనక వాహనాలు ఢీకొట్టడంతో ఆమె ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…. తెనాలిలో దేవాదాయ శాఖ ఉద్యోగి జెట్టి శ్రీనివాస రావు-నాగమణి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉంది. కుమార్తె హారిక ఎపిలో ఓ యూనివర్సిటీ నుంచి పశువైద్యురాలిగా పట్టా అందుకున్నారు.

పశువైద్య విభాగంలో ఎంఎస్ చేయడానికి ఆమె అమెరికాకు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్లమాలో ఆమె ఎంఎస్ చదువుతున్నారు. ఆదివారం ఉదయం తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా ఆమె వెనుక సీట్లో కూర్చున్నారు. ద్విచక్రవాహనదారుడు కింద పడిపోవడంతో వెంటనే కారుకు బ్రేక్ వేయడంతో వెనక నుంచి వచ్చిన వాహనాలు వారి వాహనాన్ని ఢీకొట్టాయి. వెనుక సీట్లో కూర్చున్న హారిక ఘటనా స్థలంలో మృతి మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. యూనివర్సిటీ అధికారులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. తన కూతురు మృతదేహాన్ని త్వరగా తీసుకరావాలని ఎపి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News